రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
సంగీతం : శ్రీ
సినిమా : గాయం
గాయకులు : S.P బాలు
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితొటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లొకం మారదు కాలం
దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ణానబొధ దేనికి
ఏ చరిత్ర నెర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామభాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం || నిగ్గదీసి ||
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైన
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైన
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనె సూక్తి మరువకుండ
శతాబ్ఢాలు చదవలేద ఈ అరణ్యకాండ || నిగ్గదీసి ||
సంగీతం : శ్రీ
సినిమా : గాయం
గాయకులు : S.P బాలు
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితొటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని
మారదు లొకం మారదు కాలం
దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ణానబొధ దేనికి
ఏ చరిత్ర నెర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామభాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం || నిగ్గదీసి ||
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైన
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైన
వేట అదే వేటు అదే నాటి కధే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలనె సూక్తి మరువకుండ
శతాబ్ఢాలు చదవలేద ఈ అరణ్యకాండ || నిగ్గదీసి ||
No comments:
Post a Comment