Tuesday, August 28, 2018

Chadhuvu Rani Vadivani - AthmaBandhuvu


చిత్రం  : ఆత్మ బంధువు (1962)
సంగీతం :  కె.వి. మహదేవన్
రచన  :  సినారె
గానం :  సుశీల

పల్లవి:
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో
జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు

చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం 1:
ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను
ఏ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను
కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను

చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు

చరణం 2:
తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని
యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు
చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు
కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు

చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు



Jagamantha Kutumbam Naadhi - Chakram

Movie    : చక్రం 
Singer    : శ్రీ 
Lyricist  : సిరివెన్నెల 
Music    :  చక్రి 


జగమంత కుటుంబం నాది ఏకాకి  జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి  జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తు నాతో నేనె రమిస్తూ

ఒంటరినై  అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది

మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి  జీవితం నాది

జగమంత కుటుంబం నాది ఏకాకి  జీవితం నాది
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె

నా హ్రుదయమే నా లోగిలి
నా హ్రుదయమే నా పాటకి తల్లి
నా హ్రుదయమే నాకు ఆలి
నా హ్రుదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది ఏకాకి  జీవితం నాది

జగమంత కుటుంబం నాది ఏకాకి  జీవితం నాది



Wednesday, December 27, 2017

Aanati Hrudayala Ananda Geetham - Annadammula Anubandham (1975)

Movie : అన్నదమ్ముల అనుబంధం (1975)
Lyricist : డా॥సి.నారాయణరెడ్డి
Music : చక్రవర్తి
Singers : ఎస్.పి.బాలు


పల్లవి :


ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం
అదేలే అదేలే


ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం
అదేలే అదేలే


ఆ పాట అధరాలపైన, పలికేను ఏనాటికైనా
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే


చరణం : 1


ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి


ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి


వెలుతురైనా, చీకటైనా, విడిపోదు
ఈ అనుబంధం


ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే

చరణం : 2


తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి


తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి


ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం

ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల విరిసే వసంతం
అదేలే అదేలే


ఆ పాట అధరాలపైన, పలికేను ఏనాటికైనా

ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇదేలే






Pallavi:

Aanaati hrudhayaala aanadha geetham idhele idhele
eenadu nayanaala virisey vasantha
adhele adhele

Aanaati hrudhayaala aanadha geetham idhele idhele
eenadu nayanaala virisey vasantha
adhele adhele

aa paata adharaala paina palikenu yenaatikaina
Aanaati hrudhayaala aanadha geetham idhele idhele

Charanam 1:

yeteta mana inta ee pandaga jaragaali
ee nilayam kalakaalam sree nilayamai nilavali

yeteta mana inta ee pandaga jaragaali
ee nilayam kalakaalam sree nilayamai nilavali

veluthuraina cheekataina vidipodhu
ee anubhandham

Aanaati hrudhayaala aanadha geetham idhele idhele

Charanam 2:

thaarakale dhigivachi thaarangam aadaali
vennelale mungitilo venuvulai paadali

thaarakale dhigivachi thaarangam aadaali
vennelale mungitilo venuvulai paadali

aatalaaga paatalaaga saagaali mana jeevitham

Aanaati hrudhayaala aanadha geetham idhele idhele
eenadu nayanaala virisey vasantha
adhele adhele

aa paata adharaala paina palikenu yenaatikaina

Aanaati hrudhayaala aanadha geetham idhele idhele




Saturday, December 16, 2017

Gunna Mamidi Komma meedha - BalaMithrula Katha

Movie      : బాలమిత్రుల కధ
Singer     : ఎస్. జానకి
Lyricist    : ఆత్రేయ
Music      : సత్యం

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది
అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది
పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే
పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే
చివురులు ముట్టదు చిన్నారి కోయిల
చిలక ఊగదు కొమ్మ ఊయల
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి
ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి
రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా
రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా
చిలకా కోయిల చేసిన చెలిమి
ముందు తరాలకు తరగని కలిమి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి

గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి


Nannu Dochukunduvate -- Gulebakavali Katha (1962)

Movie     :   గులేభకావళి కథ
Lyricist   :   సి.నా.రే
Music     :   Joseph V. కృష్ణ మూర్తి
Singer    :    ఘంటసాల 

నన్ను దోచుకుందువటె 
నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి | నన్ను దోచుకుందువటె

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన (2)
పూలదండవోలె కర్పూర కళికవోలె కర్పూర కళికవోలె
ఎంతటి నెఱజాణవు నా అంతరంగమందు నీవు (2)
కలకాలము వీడని సంకెలలు వేసినావు
సంకెలలు వేసినావు | నన్ను దోచుకుందువటె

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి | నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటె 

నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై (2)
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో కలసిపోదు నీలో
ఏనాటిదో మనబంధం ఎరుగరాని అనుబంధం (2)
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం | నన్ను దోచుకుందువటె

నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి | నిన్నే నా స్వామి
నన్ను దోచుకుందువటె 






Aamani padave haayiga -- Geetanjali (1989)

Movie    : గీతాంజలి
Singer    : S.P బాలు
Lyricist  : వేటూరి
Music    : ఇళయరాజా



ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో | పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల... | మౌనమైన వేళల...
ఆమని పాడవే హాయిగా | ఆమని పాడవే హాయిగా

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
పదాల నా యద | స్వరాల సంపద
తరాల నా కథ | క్షణాలదే కదా
గతించిపోవు గాధ నేనని

ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో 

శుకాలతో పికాలతో ధ్వనించిన మధూదయం
దివి భువి కలా నిజం స్ప్రుసించిన మహోదయం
మరో ప్రపంచమే | మరింత చేరువై
నివాళి కోరిన | ఉగాది వేళలో
గతించిపోని గాధ నేనని

ఆమని పాడవే హాయిగా | మూగవైపోకు ఈ వేళ
రాలేటి పూల రాగాలతో | పూసేటి పూల గంధాలతో
మంచు తాకి కోయిల... | మౌనమైన వేళల...
ఆమని పాడవే హాయిగా | ఆమని పాడవే హాయిగా




Saturday, November 25, 2017

Prema Ledhani Premincharadhani - Abhinandhana ()

Movie      :  అభినందన 
Lyricist    :  ఆత్రేయ 

Singer     :   S.P బాలు

ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ
ఓ ప్రియా జోహారులు                                             || ప్రేమ లేదని ||

మనసు మాసిపోతే మనిషే కాదని
కటిక రాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి
మోడుబారి నీడ తోడు లేకుంటిని                          || ప్రేమ లేదని ||

గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ                  || ప్రేమ లేదని ||